గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజనను విస్మరించరాదు

న్యూ దిల్లీ, జూలై 22 : కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని తప్ప కుండా పంపిణీ చేయా ల్సిందేనని కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ…ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనన్నారు.

రాష్ట్రాలు ఉచిత బియ్యం పంపిణీని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఉచిత బియ్యాన్ని తెలంగాణ సరిగ్గా పంపిణీ చేయడం లేదని..అందుకే తెలంగాణపై ఒత్తిడి తీసుకురావాల్సి వొచ్చిందని అన్నారు. ఏపీతో కూడా ఉచిత బియ్యం పంపిణీపై మాట్లాడుతున్నామని, త్వరలో అక్కడ కూడా ఉచిత బియ్యం పంపిణీ సవ్యంగా చేస్తారని అనుకుంటున్నానని పియూష్‌ ‌గోయల్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *