ఖమ్మం సభకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక
విజయవాడ, జూలై 1 : ఖమ్మం సభకోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయవాడలో దిగి హెలికాప్టర్‌లో ఖమ్మం వెళ్లనున్నారు. సీనియర్ నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారు.
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు సాయంత్రం ప్రత్యేక విమానంలో రాహుల్ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆయన ఖమ్మంకు బయల్దేరుతారు. ఈ సభలో భట్టిని రాహుల్ గాంధీ సత్కరించనున్నారు. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. సభ అనంతరం రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో గన్నవరంకు వెళ్లి… అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.



