మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ ముని తెలిపారు. ఆదివారం గణేశ్ మండపాల ఆర్గనైజింగ్కమిటీ సభ్యులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వినాయక మండపాల ఏర్పాటులోనిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వివాదాస్పద స్థలాల్లోవిగ్రహాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా రోడ్డుకు అడ్డంగా మండపాలను ఏర్పాటు చేయవద్దని తెలిపారు. విగ్రహాల వద్ద వీఐపీలు వస్తే పోలీసులకు తగు సమాచారాన్నిచేరవేయాలని అన్నారు. ఇతరుల స్థలంలో మండపాలను ఏర్పాటు చేస్తేసదరు యజమాని నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలని సూచించారు. విగ్రహాల వద్ద ఎల్లప్పుడు ఆర్గనైజర్లు అందుబాటులో ఉండాలని అన్నారు.నిర్వాహకులు పోన్ నంబర్లను పోలీసు స్టేషన్లో అందజేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు నర్సయ్యయాదవ్, రవీందర్, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.



