“గణతంత్ర ” మేలా

భారత రాజ్యాంగ ఉద్గ్రంధం

అవిష్కృతమైన శుభ దినం

 

సర్వసత్తాక సార్వభౌమత్వం

సంప్రాప్తమైన శుభ తరుణం

 

అగ్ర ప్రజాస్వామ్య దేశంగా

అవతరించిన శ్రేష్ఠ కాలం

 

నవ భారత నిర్మాణానికి

శ్రీకారం పలికిన సమయం

అదే గణతంత్ర దినోత్సవం

 

ఈ మహోత్సవ వేళలో

సంబరాలు జరుపుదాం

 

జాతీయ జెండా ఎగరేసి

జనగణ గీతి పల్లవిద్దాం

 

ఊరేగింపులుగా తరలి

దేశమాతకు జైకొడదాం

 

మాతృదేశ విముక్తికి

మరణాన్ని ముద్దాడిన

అమరవీరుల స్మరిద్దాం

 

సర్వస్వం ధారబోసిన

త్యాగధనుల శ్లాఘిద్దాం

 

గెలుపు సాధించి పెట్టిన

సమర ధీరుల స్తుతిద్దాం

 

జై జవాన్.. జై కిసాన్

మేరా భారత్ మహాన్

నినాదాల హోరెత్తిద్దాం

 

ఎగిరే పతాకం సాక్షిగా

విశిష్ట రాజ్యాంగ స్ఫూర్తి

ప్రజాస్వామ్య విలువలను

పరిరక్షిస్తామని బాస చేద్దాం

 

ఆశయ సాధనకై అడుగువేసి

మన భారత ప్రశస్తి చాటుదాం

            “””””””””

(జనవరి 26 న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా….)

 

                        కోడిగూటి తిరుపతి

                        ;9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *