గజ్వెల్  లో కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదములు

జగదేవపూర్,ప్రజాతంత్ర, డిసెంబర్ 4: మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి  సీఎం కేసీఆర్ ను భారీ ఓట్ల మెజార్టీతో అందించిన దౌలపూర్ గ్రామ ప్రజలందరికీ  గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….రాష్ట్రంలో పార్టీ అధికారంలో రాకున్నా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  మన గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందడంలో  మన గ్రామ ప్రజలందరూ మాపై నమ్మకంతో   బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినందుకు  మీకు జన్మజన్మల రుణపడి ఉంటామని, ఎవ్వరం అధైర్య పడవలసిన అవసరం లేదని మీ అందరికీ అండగా మెంముంటామని మాకు అండగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ  సదా మీ సేవలో ఉంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *