ఖమ్మం ఖిల్లాకు‘హస్త’ కళ

  • పొంగులేటి చేరికతో  నేతల్లో జోష్‌
  • ‌సమరశంఖారావానికి సన్నద్ధమైన పార్టీ
  • 100 ఎకరాలు, 5 లక్షల జనం

కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా నడి బొడ్డు నుండి కాంగ్రెస్‌ ‌జనగర్జనతో శంఖారావం పూరించనుంది. రాష్ట్రంలో వేసవి తాపం ఇలా తగ్గిందో లేదో ఖమ్మంలో •నిర్వహించే జనగర్జనతో కాంగ్రెస్‌ ‌తెలంగాణాలో అలా రాజకీయ హీట్‌ ‌పెంచేందుకు సిద్ధమైంది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఖమ్మంలో జనగర్జన పేరుతో నేడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చక చకా జరిగిపోతున్నాయి. ఎస్‌ఆర్‌ ‌గార్డెన్స్ ‌సమీపంలోని 100 ఎకరాల స్థలంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభ కోసం ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండటంతో పనులన్నీ యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేశారు.

సభకు దిల్లీ నుంచి కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు, రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు హాజరు కానున్నారు. 5 లక్షలకు పైగా జనం తరలి రావచ్చనే అంచనాలు నాయకుల్లో ఉన్నాయి. భారీ బహిరంగ సభకు వొచ్చే వాహనాలు సభా ప్రాంగణం చుట్టు నిలిపేలా పార్కింగ్‌ ‌స్థలాలను ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం జరుగకుండా సాఫీగా ఉండేలా పార్కింగ్‌ ‌స్థావరాలను ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఖమ్మంలో నిర్వహించే జనగర్జనకు 100 ఎకరాల సభాప్రాంగణాన్ని అన్ని హంగులతో తీర్చి దిద్దారు.

పొంగులేటి నేతృత్వంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది జనం హాజరుకానున్నారు. ఈ సభకు యువ నాయకుడు రాహుల్‌ ‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ ‌దిగ్గజాలు మల్లికార్జున్‌ ‌కాక్రే్న లాంటి  పెద్దల సమక్షంలో పొంగులేటి సైత్యం చేరిక ఉంటుంది. ఈ జనగర్జన సభకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ హాజరుకాను న్నారు. ఆయనతో పాటు రాష్ట్రవ్యవహారాల ఇన్‌ ‌చార్జి మాణిక్‌ఆవుఠాక్రే సహా ఇతర ముఖ్యనేతలు సైతం రానున్నారు. రేవంత్రెడ్డి, భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రానికి చెందిన ప్రముఖులు సైతం హాజరుకానున్నారు. ఇప్పటికే సీనియర్‌  ‌సక్సెస్‌ ‌చేసేందుకు దఅష్టిసారించారు. బహిరంగ సభలోనే పొంగులేటితో పాటు ఆయన సైన్యం  కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకోడం ఖాయమైంది.

100ఎకరాలు, 5లక్షల జనం
వంద ఎకరాల్లో  జనగర్జన సభకు 5 లక్షలకు పైగా జనం వొస్తారని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్‌ ‌నేతలు. సభ కోసం 100ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌ ‌కోసం 50ఎకరాల్లో నాలుగు చోట్ల పార్కింగ్‌ ‌స్థలాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుండి కాంగ్రెస్‌ ‌శ్రేణులు, పొంగులేటి అభిమానులే సభకు పెద్ద ఎత్తున రానున్నారు. జనసమీకరణకు ఇప్పటికే వాహనాలను సిద్ధం చేశారు.

అడుగడుగునా అవాంతరాలు
ఖమ్మం సభనుండే కాంగ్రెస్‌ అధికార పార్టీపై సమరశంఖారావం పూరించేందుకు సిద్దమైంది. ఈ సభతో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌క్యాడర్‌లో ఓ కొత్త జోష్‌ ‌నింపేందుకు కసరత్తు చేస్తున్నారు నేతలు. జనగర్జన సభతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాలలో కాంగ్రెస్‌ ‌పట్టు సాధించాలనే పట్టుదలతో పొంగులేటి వర్గం, కాంగ్రెస్‌ ‌శ్రేణులు ప్రతిష్టాత్మంగా తీసుకుంటే, అధికార బిఆర్‌ఎస్‌ ‌నాయకులు పరువు దక్కించుకునేందుకు సభ విజయవంతం కాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. పొంగులేటి జన సమీకరణకు 300 బస్సుల కోసం రూ 2కోట్లు ఆర్టిసికి చెల్లించారు. అయితే అధికార పార్టీ ఒత్తిళ్ళకు తలొగ్గిన ఆర్టిసి అధికారులు తీరా సమయానికి బస్సులు ఇవ్వలేమంటూ హ్యాండ్‌ ఇచ్చారు. జనగర్జనకు ప్రజలు వెళ్లకుండా బిఆర్‌ఎస్‌ ‌నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయాల్సిన కసరత్తులు అన్నీ చేస్తున్నారు. వాహనాలను సైతం అందుబాటులో లేకుండా బీఆర్‌ఎస్‌ ‌నాయకులు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

దీనితో పొంగులేటి వర్గానికి, కాంగ్రెస్‌ ‌శ్రేణులకు జన సమీకరణ పెను సవాలుగా మారింది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర కూడా ఖమ్మం చేరుకుంటున్న నేపథ్యంలో తమ డైనమిక్‌ ‌లీడర్‌ ‌పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఖమ్మంలోనే ఉంటూ సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్న ఈ తరుణంలో తగ్గేదేలే అంటూ జనగర్జనను విజయవంతం చేసేందుకు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని సభకు వొచ్చేలా కాంగ్రెస్‌ ‌శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ సృష్టిస్తున్న అడ్డంకులను అధిగమించి జనగర్జనలో పొంగులేటి అభిమానులు ఎలా గర్జిస్తారో వేచిచూడాలి. సభాప్రాంగణంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున్న ప్రజలు కూర్చునేందుకు పెద్దపెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత తోరణాలతో ఖమ్మం హస్త కళతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *