మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు- 2023 కార్యక్రమాలలో భాగంగా ఎంపిక చేయబడిన అర్హులైన అభ్యర్థులను, సంస్థలను గౌరవించి సత్కరించుటకు నిర్ణయించింది. ఇందుకుగాను అర్హులైన క్రైస్తవ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. సామాజిక సేవ రంగం, వైద్య సేవలు, విద్యా బోధన, సాహిత్యం, కలలు, క్రీడా రంగాలలో విశేషమైన సేవలు అందించిన క్రైస్తవులు, 30 సంవత్సరాల పైబడి సేవ చేస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు గౌరవ సత్కారం 2023-2024 సంవత్సరం గాను సత్కారం అందుకొనుటకు అర్హులని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమ్మద్ ఖాసిం తెలియజేశారు. దరఖాస్తు చేసుకోగల అభ్యర్థులు సంస్థలు తమ నామినేషన్లను నిర్ణీత నమూనాలో పంపుటకు దరఖాస్తులను డిసెంబర్ 13వ తేదీ 2023 నుంచి 15వ తేదీ డిసెంబర్ 2023 లోపు జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం, రూమ్ నెంబర్ ఎస్ 2, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్, అత్తాయిపల్లి శామీర్పేట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తమ దరఖాస్తులు అందజేయాలని తెలియజేశారు. దరఖాస్తు ఫారంలు www.tscmfc.in అంతర్జాలంలో కానీ, సంబంధిత తెలంగాణ రాష్ట్ర క్రైస్తవుల అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సహాయ సంస్థ, (TSCMFC) చింతల బస్తి ఖైరతాబాద్ హైదరాబాదు నుండి గాని, మేడ్చల్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో గాని పొందవచ్చునని, మరిన్ని వివరాలకు 040 – 23391067 నెంబర్ లో సంప్రదించగలరని మహమ్మద్ ఖాసిం సూచించారు.




