కౌంట్‌ డౌన్‌..10 ప్రజా‘తంత్రం’

ఈసీ ఆంక్షల చిట్టా చాంతాడంత
టేకిటీజీ పాలసీ పెరగడమే వింత
ఎన్నికల్లో ఆడంబరాలు కొండంత
ఆరా తీస్తే దొరికే నేతల లెక్కెంత?

అఫిడవిట్లలో చూపే ఆస్తి గోరంత
జాస్తిగా ఉంటుంది బినామీ సంత
సోదాల్లో పట్టుబడే డబ్బు రవంత
కన్నుగప్పే సొమ్ము మేయలేనంత!
– వి.రమేష్‌ బాబు

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మానకొండూరు, స్టేషన్‌ ఘనపూర్‌, నకిరేకల్‌ మరియు నల్గొండ నియోజక వర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమెర్జెన్సీ ..ఎన్‌కౌంటర్లు అని విమర్శించారు. ఆ టైంలో ఎట్లా ఉండే.. తమ హయాంలో ఎట్లా ఉందో బేరీజు వేసుకుని చూడాలన్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా జనగామ, కోరుట్ల సకల జనుల విజయ సంకల్ప బహిరంగ సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ లో ఉప్పల్‌, నాచారం ప్రాంతాల్లో రోడ్‌ షో నిర్వహించారు.
కేసిఆర్‌ ప్రభుత్వం ఆవినీతిలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, రాష్ట్రంలో బిజెపి ఆధికారంలోకి వొచ్చాక అవినీతిపరులను జైలుకు పంపిస్తామని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి ఆమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నర్సాపూర్‌, పరకాల నియోజక వర్గ విజయభేరి ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ పరిపాలనపై విమర్శలు వ్యంగ్యంగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకు, కాంగ్రెస్‌ పార్టీకి క్షమాపణ చెప్పాలని  డిమాండ్‌ చేశారు. ఖైరతాబాద్‌, నాంపల్లి రోడ్‌ షో ల్లో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి అన్నం పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ కి దానం సున్నం పెట్టారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *