వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈ నెల 3న జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి సిబ్బంది కేటాయింపులను జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో శనివారం నిర్వహించి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు ఆకాష్, సుధాకర్ జైలాక్సో ల సమక్షంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ర్యాండమైజేషన్ నిర్వహించి కౌంటింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఈడియం మహమూద్ అలీ పాల్గొన్నారు.
కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ ద్వారా ఎంపిక




