న్యూ దిల్లీ, డిసెంబర్ 27 : అనేక ప్రపంచదేశాల్లో వ్యాక్సినేషన్ నేటికీ అందడం లేదు. పలు పేదదేశాలు తమకు టీకా కోసం ఎదరు చూస్తున్నాయి. అభివృద్ది చెందిన దేశాలు పిల్లలకు కోవిడ్ టీకా సంగతి ఎలా అని ఆలోచిస్తున్నాయి. అయితే పేదదేశాల్లో సామాన్యులకు కూడా తగిన సంఖ్యలో వ్యాక్సినేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు ఇలాంటి దేశాలకు అండగా నిలవాలని కోరుతోంది. కొరోనా ఫోర్త్‌వేవ్ ఉధృతి నేపథ్యంలో పిల్లలను వ్యాక్సినేషన్ పరిధిలోకి తెచ్చే దిశగా ప్రపంచ దేశాలన్నీ చొరవచూపే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన దేశాల జాబితాలో అమెరికా, కెనడా, స్పెయిన్ ఉన్నాయి. ఈ మూడు దేశాల్లో 5-11 ఏళ్లలోపు వారికి టీకాలు వేస్తున్నారు.
ఈ తరుణంలో ఇప్పటికే పిల్లల వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన దేశాలపై అందరి దృష్టి పడింది. ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల్లో ఇప్పటికే పిల్లల వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇంకొన్ని దేశాలు వచ్చే సంవత్సరంలో పిల్లలకు టీకాలిచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. పిల్లలకు వ్యాక్సినేషన్ చేస్తున్న దేశాల్లో ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయెల్, ఒమన్, సౌదీ అరేబియా, యూఏఈ, కోస్టారికా దేశాలున్నాయి. 12-15 ఏళ్లలోపు వారికి నేరుగా టీకా రెండో డోసును ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వ ఔషధ నియంత్రణ విభాగం సిఫారసు చేసింది.
అర్జెంటీనాలో మూడేళ్లకు పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. బహ్రై, చైనాల్లో 3-11 ఏళ్లలోపు పిల్లలకు, చిలీ, ఈక్వెడార్, ఎల్ సాల్వెడార్ దేశాల్లో 6-11 ఏళ్లలోపు వారికి టీకాలు ఇస్తున్నారు. 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేస్తున్న దేశాల్లో జోర్డాన్, మొరాకో, గినియా, నబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఆస్టేల్రియా, ఫిలిప్పీన్స్, ఎస్టోనియా, డెన్మార్క్, గ్రీస్, ఐర్లాండ్, లిథ్వేనియా, స్వీడన్, ఫిన్లాండ్ ఉన్నాయి. 14 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కోసం జింబాబ్వే, 15 ఏళ్లు పైబడిన వారికి టీకాలిచ్చేందుకు మెక్సికో ఆమోదం తెలిపాయి.
హెటిరో కోవిడ్ ఔషధానికి డబ్ల్యుహెచ్ఓ ఆమోదం
నిర్మాకామ్ కాంబో ప్యాక్ ప్రారంభం
నిర్మాకామ్ కాంబో ప్యాక్ ప్రారంభం
హైదరాబాద్, డిసెంబర్ 27 : కోవిడ్‌పై పోరు సల్పేందుకు హెటెరో సంస్థ అభివృద్ధి పరిచిన ఔషధం నిర్మాకామ్ జనరిక్ వెర్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) సిఫార్సు (ప్రిక్వాలిఫికేషన్ ఆఫ్ మెడినిస్స్ ప్రోగ్రామ్) లభించింది. ఈ విషయాన్ని హెటెరో సంస్థ సోమవారం వెల్లడించింది. నిర్మాట్రెల్విర్ 150 ఎంజి (రెండు ట్యాబెట్లు), రిటోనావిర్ 100 ఎంజి (ఒక ట్యాబ్లెట్) కలిపి నిర్మాకామ్ అనే కాంబో ప్యాక్‌ను హెటెరో ప్రారంభించింది. ఈ కాంబో ప్యాక్‌నే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కోవిడ్?19 రోగులకు అంటే వ్యాక్సినేషన్ పొందని, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కోవిడ్ రోగులకు నిర్మా త్రెల్విర్ రిటోనావిర్ను ఇవ్వవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ బలంగా సిఫార్సు చేసినట్లు హెటెరో ఒక ప్రకటనలో తెలిపింది.
కోవిడ్ నిర్థారణ అయిన తరువాత వీలైనంత త్వరగా లేదా కోవిడ్ వ్యాధి లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఈ మందును వాడాలని హెటెరో తెలిపింది. దేశంలోని అన్ని హెటెరో ప్లాంట్లలోనూ ఈ నిర్మాకామ్ తయారువుతోంది. కాగా, ఈ ఔషధాన్ని తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.



