అమరావతి,జూలై19 :దక్షిణ కొరియాలో ఆర్థిక, ప్రణాళిక , నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన కొనసాగుతున్నది. సియోల్ లో ’కియా మోటార్స్ కార్పొరేషన్’ గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈవో హో సంగ్ సాంగ్తో సమావేశమయ్యారు.కొరియన్ టెక్స్టైల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్’ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించింది.
ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి , శిక్షణకు గల అవకాశాలను అధ్యయనం చేయడం దిశగా చర్చలు .రిపారు. చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు.



