కొత్తగూడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 19 : మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూఎఉ మండల పరిధిలోని కొత్తగూడలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా విద్యార్థులకు సరియైన భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి  తెలుసుకున్నారు.మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని స్పెషల్ ఆఫీసర్ మరియు మండల విద్యాధికారిని ఆదేశించారు. విద్యార్థులు గణిత శాస్త్రంలో వెనకబడి ఉన్నారని,ఉపాధ్యాయురాలు వెంటనే  చర్యలు తీసుకొని ఆయ సబ్జెక్టులో పట్టు కల్పించాలని ఆమె సూచించారు. ఉపాధ్యాయులు సమయానికి తరగతులకు వెళ్లాలని,ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాఠాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అనితారెడ్డి తెలియజేశారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ,పేదల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను మెరుగుపరిచేందుకు గత ప్రభుత్వాలు సైతం ఎంతో కృషి చేస్తాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులదేనన్నారు.ఎలాంటి లోటుపాతులు కలగాకుండా విద్యార్థినిలను చూడాలని ఆమె ప్రిన్సిపల్ భార్గవికి సూచించారు.ఏదైనా సంఘటన జరిగితే ఉపేక్షించేది లేదని జిల్లా పరిషత్ చైర్మన్ తెలిపారు.ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు రాత్రి వేళలో అందుబాటులో ఉండాలని కూడా అని వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు అండగా ఉపాధ్యాయులతో పాటు పలువురు రాజకీయ నాయకులు ప్రతివారం పాఠశాలలను సందర్శించాలని ఆమె నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మెన్ దేవర శెట్టి చంద్రశేఖర్,మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,స్థానిక బిఆర్ఎస్ నాయకులు సామ ప్రకాశ్ రెఢ్ఢి,తల్లోజు లక్ష్మణాచారి,తాళ్ల కార్తీక్,బొక్క దీక్షిత్ రెడ్డి,బొక్క.వెంకట రెడ్డి,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *