శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ. దసరా వేడుకలను శేరిలింగంపల్లి నియోజక వర్గం
కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో గురువారం నిర్వహించారు.విద్యార్థినీ,విద్ యార్థులు సంప్రదాయ వస్త్రాలతో ఉత్సహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఆడిపాడారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ దసరా వేడుకలను తమ శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వర్ రావు,ప్రిన్సిపల్ క్రాంతి మేడం ప్రధానోపాధ్యాయులు భవాని,రాజు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




