- అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి
- క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం
- ఎగవనీటి రాకతో నిండిన సరూర్‌నగర్ చెరువు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : జంటనగగరాల్లో శుక్రవారం అడపాదడపా వర్షం కురుస్తున్నా..మధ్యలో కొంత తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా కార్యక్రమాలు సాగిస్తున్నారు. గత మూడు రోజులతో పోలిస్తే శుక్రవారం పరిస్థితి మెరుగయ్యింది. హైదరాబాద్లోఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. నగరంలోని ప్రస్తుత పరిస్థితులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో అధికారులతో మంత్రి తలసాని సవి•క్షించారు. వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్‌కు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని.. నీటి లెవల్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు. హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటి విడదుల జరుగుతున్నందున లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంట వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలన్నారు.
మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అన్ని స్థాయిల్లోని అధికారులను సమన్వయపరుచుకుంటూ పనిచేయాలని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నది. పౌరులు అందిం చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా నీటి తొలగింపునకు 157 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాల తొలగింపు పనులు చేపడుతున్నాయి. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక డీఆర్ఎఫ్ బృందాలు అక్కడక్కడ విరిగిన పడిన చెట్లను వెను వెంటనే తొలగిస్తూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తున్నారు.
నగరంలోని 185 చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తుగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదే సమయంలో శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కమిషనర్ రోనాల్డ్‌రోస్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లతో ఎప్పటికప్పుడు సవి•క్ష జరుపుతూ తగు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. వర్షాలతో రోడ్డుపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో ఈవీడీఎం బృందాలు మోహరించి సహాయక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. కాగా శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులకు సూచించారు. మరోవైపు సరూర్‌నగర్ చెరువులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. సరూర్ నగర్ చెరువులో గేట్లు ఎత్తివేతకు అధికారులు సిద్ధమయ్యారు. అంతకు ముందే గేట్ల వద్ద ఉన్న చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు. గేట్లు ఎత్తివేసిన తరువాత పైపులలో వరద నీరు వెళ్ళేటప్పుడు చెత్త అడ్డంకిగా లేకుండా సిబ్బంది తొలగిస్తోంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ డీఈ పవన్ కుమార్ ద్గరుండి పనులు పర్యవేక్షించారు. ఎగువ ప్రాంతం నుంచి సరూర్‌నగర్ చెరువులో నీరు ఎక్కువగా వచ్చి చేరుతోందన్నారు. గేట్లు ఎత్తివేతవేయడానికి ముందు చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. మొత్తం ఏడు గేట్లలో నాలుగు గేట్లను తెరువనున్నట్లు చెప్పారు. జిల్లాలగూడ, వి•ర్‌పేట్, భైరామల్‌గూడ చెరువులతో పాటు పలు కాలనీలో నుంచి నీరు చెరువులోకి వచ్చి చేరుతున్నాయన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మూడు గేట్లను ఎత్తామన్నారు. ఇక్కడి నుంచి మూసిలోకి నీరు వెళ్తుందని చెప్పారు. రాత్రి చెరువుపై భాగంలో ఉన్న కాలనీలలో నీరు భారీగా వచ్చిచేరిందని పవన్ కుమార్ తెలిపారు




