బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బండి సంజయ్
భ్రమలో కేసీఆర్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేసీఆర్‌వి పగటి కలలు : బిజెపి రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్.
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీ పెడతారని టీఆర్‌ఎస్ పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కేసీఆర్ టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం వి•డియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ ముందుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనపై.. అదే సమయంలో కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. వారసత్వ, అవినీతి పార్టీలు దేశంలో అంతమైపోతున్నాయని అన్నారు. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని సంజయ్ ఆరోపించారు. ప్రపంచంలో భారత్‌ను మోడీ అగ్రస్థానంలో నిలిపారని చెప్పారు. కానీ, కేసీఆర్ మాత్రం ఎన్నికల హావి•లను తుంగలో తొక్కారని మండిపడ్డారు.
భ్రమలో కేసీఆర్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కల్వకుంట్ల కుటుంబ తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. మోడీకి వ్యతిరేకంగా తానే పెద్ద నాయకుడనే భ్రమలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవాచేశారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ ఫాంహౌస్‌లో కూర్చొని కేసీఆర్ కలలు కంటున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ సరిపోవడం లేదని, దేశాన్ని కూడా పంచుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్‌వి పగటి కలలు : బిజెపి రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్
ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల నినాదాన్ని ఎత్తుకున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం దిల్లీలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయని, కేసీఆర్‌కు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందన్నారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు కేసీఆర్ తీరుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మహిళలపై దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంపై కేసీఆర్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ వాహనంలో అత్యాచారం జరిగిందని, ముఖ్యమంత్రి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. రక్షక భటులే, భక్షక భటులుగా మారారని తరుణ్ చేగ్ ఘాటుగా విమర్శించారు.



