కేసీఆర్‌ ‌సర్కారు వైఖరి వల్లే గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యం

  • పదేళ్లుగా కేసీఆర్‌ ‌తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు
  • కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు  చెబుతున్నారు
  • ఎంఐఎం దగ్గర కారు స్టీరింగ్‌ ఉన్న భారాస సర్కారు అవసరమా?
  • కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదు
  • ఆదిలాబాద్‌ ‌జనగర్జన సభలో కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా

ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌కేసీఆర్‌ ‌సర్కారు వైఖరి కారణంగానే గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ ‌లో జరిగిన బీజేపీ  జనగర్జన సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమిత్‌ ‌షా మాట్లాడుతూ..  గిరిజన వర్సిటీకి కేసీఆర్‌ ‌సర్కారు జాగా చూపించలేదు.. అందుకే ఆలస్యమైంది అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. మోదీ..కృష్ణా ట్రైబ్యునల్‌ ‌నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు. పదేళ్లుగా కేసీఆర్‌ ‌తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు. కేసీఆర్‌.. ‌రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం గురించే కేసీఆర్‌ ఆలోచించారు. రజాకార్లపై పోరాడిన వీరభూమికి నమస్కారం చేస్తున్నా. తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలి. రాష్ట్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తోంది. డిసెంబర్‌3‌న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి. మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి.

తెలంగాణలో డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌రావాల్సిన సమయం ఆసన్నమైంది అని అమిత్‌ ‌షా అన్నారు. పవిత్ర భూమి అయినటువంటి ఆదిలాబాద్‌కు వచ్చాను. కుమురం భీం పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కుమురం భీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభిస్తా. కేసీఆర్‌ ‌గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు..కానీ అమలు చేయలేదు. ఆదివాసీలకు కేసీఆర్‌ ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా?అయోధ్యలో రామమందిరం కట్టాలా.. వద్దా.. చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోదీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది. మోదీ సర్కారు ఆర్టికల్‌ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించింది. మోదీ సర్కారు సర్జికల్‌ ‌స్ట్రయిక్స్ ‌నిర్వహించి శత్రువులను తరిమి కొట్టింది. ప్రతి పేద మహిళకు మోదీ వంటగ్యాస్‌ ‌సిలిండర్‌ ఇచ్చారు. రైతుల ఖాతాల్లో ఏటా రూ.6వేలు జమ చేస్తున్నాం. దళితులు, గిరిజనుల కోసం మోదీ 9 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. కేసీఆర్‌ ‌మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు.

ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను నరేంద్ర మోదీ  రాష్ట్రపతిని చేశారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ ‌వాళ్లు కొత్త బట్టలు వేసుకుని వస్తారు. కాంగ్రెస్‌ ‌పేదల గురించి మాట్లాడుతుంది కానీ…పేదల కోసం ఏం చేయదు. గతంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదు. 9ఏళ్లుగా నరేంద్ర మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌ ‌వన్‌ ‌చేశానని కేసీఆర్‌ ‌చెబుతుంటారు. రైతుల ఆత్మహత్యల విషయంలో కేసీఆర్‌ ‌తెలంగాణను నెంబర్‌వన్‌ ‌చేశారు. అవినీతి విషయంలో కేసీఆర్‌ ‌తెలంగాణను నెంబర్‌వన్‌ ‌చేశారు. కేసీఆర్‌ ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ కారు స్టీరింగ్‌ ‌మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుంది. ఎంఐఎం దగ్గర స్టీరింగ్‌ ఉన్న భారాస సర్కారు అవసరమా? చంద్రశేఖర్‌రావూజీ.. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.  కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు చెబుతున్నారు.

ఆధునిక రజాకార్‌ల నుంచి తెలంగాణను భాజపా మాత్రమే కాపాడుతుంది. మోదీ సర్కారు ఉచితంగా టీకాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కరోనా నుంచి కాపాడింది. జీ-20 నిర్వహించడం వల్ల ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రశంసించాయి.  కేసీఆర్‌ ‌గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు..కానీ అమలు చేయలేదు.  ఆదివాసీలకు కేసీఆర్‌ ‌రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్నారు…ఇచ్చారా? అయోధ్యలో రామమందిరం కట్టాలా.. వద్దా.. చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోదీ సర్కారు రామమందిరం నిర్మిస్తుంది. మోదీ సర్కారు ఆర్టికల్‌ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించింది. మోదీ సర్కారు సర్జికల్‌ ‌స్ట్రయిక్స్ ‌నిర్వహించి శత్రువులను తరిమి కొట్టింది అని అమిత షా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *