కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం హర్షానీయం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30:కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు రాఖీ పౌర్ణమి కానుకగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం హర్షానీయమని భారతీయ జనతా పార్టీ మీడియా సెల్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు అన్నారు. ఆయన  సిద్దిపేటలో మాట్లాడుతూ గృహోపయోగ ఎల్పిజి సిలిండర్ పై కేంద్రం రూ.200 చొప్పున  తగ్గించిందన్నారు.అలాగే ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా ప్రస్తుత తగ్గింపుతో వారికి రూ.400 మేర ప్రయోజనం చేకూరనుందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తగ్గింపు నిర్ణయంతో దేశంలోని 33 కోట్ల మంది వినియోగదారులకు లాభం చేకూరుతుందని చెప్పారు.ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై సుమారుగా రూ 7,500 కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు.అయినా పేద మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.గ్యాస్ ధరల తగ్గింపుతో రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం జరుగుతుందన్నారు. ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మార్కండేయులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *