కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హెయమైన చర్య : మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 20 : కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి అని చూడకుండా తెలంగాణ పోలీసులు ప్రవర్థించిన తీరు విడ్డూరంగా ఉందన్నారు.రజాకార్ల పాలనను తలదన్నేల కెసిఆర్ పాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.నిర్మించిన ఇండ్లను పరిశీలిస్తే తమ బండారం ఎక్కడ బయట పడుతుందోనని,వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ వెనుకాల ఉండరని పోలీసుల చేత బిజెపి నాయకులను,ఎమెల్యేలను,కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ లు చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
కేంద్ర హోం సహాయ మంత్రి,తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి పిలుపు మేరకు బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలనకై బయలు దేరిన కిషన్ రెడ్డి,దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,కొండ విశ్వేశ్వర్ రెడ్డి,తుల్లా వీరేందర్ గౌడ్,రాష్ట్ర నాయకులను విమానాశ్రయం దగ్గరే పోలీసులు అరెస్టు చేయడం ఎంటని ఆయన ప్రశ్నించారు.వారితో పాటు మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు మండలం ఎంపిపి మంద జ్యోతి పాండు,కొంతం జంగారెడ్డి,బొక్క సత్యనారాయణ రెడ్డి,ఎగిడి సత్తయ్య, కందుకూరు మండల బిజెపి కిషన్ మోర్చా అధ్యక్షులు కళ్లెం చెన్నారెడ్డి,బిజెవైఎం కందుకూరు మండల అధ్యక్షులు లింగం యాదవ్,బిజెవైఎం కందుకూరు మండలం ఉపాధ్యక్షులు సామల దయాకర్ రెడ్డి, దెబ్బడగూడ గ్రామ బూతు అధ్యక్షులు గణేష్ లను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *