కేంద్ర ప్రభుత్వ ఉపకారవేతనాన్ని సద్వినియోగ పరుచుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపకార వేతనాలను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గ్రామ శ్రీకాంత్ అన్నారు. కడ్తాల్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూత్ ఫర్ సేవా సహకారంతో ఎన్.ఎం.ఎం.ఎస్  నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా క్యామ  శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎం హెచ్ ఆర్ డి స్కీం కింద దేశవ్యాప్తంగా 1,00,000 స్కాలర్షిప్లు అందిస్తున్నది. ఎవరైతే ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల ఉన్నత పాఠశాల &  మోడల్ స్కూల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులు మాత్రమే ఈ ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ పరీక్ష రాయడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలో మెరిట్ పొందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నెలకు ₹1000 చొప్పున 4 సంవత్సరాల వరకు స్కాలర్షిప్ అందిస్తుంది. అంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ పరిధిలో చదువుకుంటేనే మాత్రమే ఈ స్కాలర్షిప్ వారికి వస్తుంది అని దీనిని సద్వినియోగ పరుచుకోవాలని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగయ్య, అరుణ ఉపాధ్యాయులు యూత్ ఫర్ సేవ వాలంటీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *