కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌ ‌పోరాటం

న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్‌  ‌తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది. జులై 3 నుంచి ఆర్డినెన్స్ ‌ప్రతులను దగ్ఢం చేసేలా దశల వారీ ప్రచార కార్యక్రమానికి ఆప్‌ ‌పిలుపు ఇచ్చింది. దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల సర్వీసులపై పట్టు బిగించే ఆర్డినెన్స్ ‌ప్రతులను ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌దగ్ధం చేస్తారు. ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కోత విధిస్తూ మే 19న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌తీసుకువచ్చింది.

ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌విపక్ష నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ‌దేశ సమాఖ్య వ్యవస్ధకు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని కేజీవ్రాల్‌ ‌చెబుతున్నారు. ఆర్డినెన్స్ ‌విషయంలో పలు బీజేపీయేతర పక్షాలు ఆప్‌నకు మద్దతుగా నిలిచాయి. ఇక ఈ అంశంపై కాంగ్రెస్‌ ఇం‌కా తన వైఖరి స్పష్టం చేయలేదు. పట్నా భేటీలోనూ కాంగ్రెస్‌ ‌మద్దతును ఆప్‌ ‌కోరగా ఇరు పార్టీలు ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *