కుల్కచర్ల తపాలా కార్యాలయంలో అందుబాటులో

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్ 11:కుల్కచర్ల తపాలా కార్యాలయంలో  జాతీయ జెండాలను విక్రయిస్తున్నట్లుకుల్కచర్ల తపాలాశాఖ సహాయ పర్య వేక్షకులు నెహ్రూ నాయక్ (ఎస్పిఎం)తెలిపారు.హర్ ఘర్ తిరంగాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా రూ.25కే జాతీయ జెండాను జెండాల విక్రయం కోసం మండల కేంద్రం లోని పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వివిద గ్రామాలకు దగ్గరలో ఉన్న సబ్ పోస్ట్ ఆఫీస్ లలో, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో  జాతీయ జెండాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జాతీయ జెండా కావలసిన వారు 25 రూ ఇచ్చి  తీసుకేళ్ళలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మొత్కూర్ వెంకటేష్, తపాలా కార్యాలయ సిబ్బంది సురేష్,వేణు, వెంకటయ్య,శ్రవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *