కురుమ సంఘం సిద్దిపేట రూరల్ మండలం అధ్యక్షులుగా  కంతుల రాజు

సిద్దిపేట,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: కురుమ సంఘం సిద్దిపేట రూరల్ అధ్యక్షులుగా రాఘవపూర్ కు చెందిన కంతుల రాజు ఎన్నికయ్యారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం  జరిగిన కురుమ సంఘం జిల్లా సమావేశంలో సిద్దిపేట  రూరల్ మండలం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కంతులు రాజు (రాఘవపూర్), ఉపాధ్యక్షులుగా ఒగ్గు రాంబాబు(తోర్నాల), కార్యదర్శిగా కంతులు మల్లేశం(చింతమడక), కోశాధికారిగా శ్రీకాంత్ (వెంకటపూర్) ఎన్నికయ్యారు. వీరికి  సంఘం జిల్లా  అధ్యక్షుడు కోరె ఎల్లయ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో  కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిందం రాజ మల్లయ్య, సిద్దిపేట పట్టణ అధ్యక్షులు బైతి నారాయణ, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోటగిరి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి కంతుల రమేష్, ఎల్లం, కరికే యాదగిరి, నర్సయ్య, స్వామి, మల్లేశం, శ్రీనివాస్, తిరుపతి, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *