కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 11 : కీసర రామలింగేశ్వర స్వామివారిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి కృష్ణారావు సోమవారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు వారికి వేద పండితులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలను సందర్శించడం వల్ల పుణ్యంతో పాటు మానసిక ప్రశాంతత దొరుకుతుందని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేవాలయాలను సందర్శించాలని తెలిపారు.
కీసర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఏనుగు సంజీవరెడ్డి, జూపల్లి శోభా కృష్ణారావు




