కాళేశ్వ‌రంపై అంతా ఒక్క‌ట‌య్యారు

– ఈట‌ల‌తో హ‌రీష్‌రావు ర‌హ‌స్య‌భేటీ అందుక‌నే
– క‌మిష‌న్ ముందు ఒకే స‌మాధానం చెప్పాల‌ని నిర్ణ‌యం
-కేసీఆర్ నిర్దేశం మేర‌కే ఈ భేటీ
-పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ఘాటు విమర్శలు

కాళేశ్వరం కమిషన్‌ ‌విషయంలో అంతా ఒకటే సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌ అవగాహనకు వచ్చారని పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు షామిర్‌ ‌పేటలో రహస్యంగా కలిశారని ఆరోపించారు.  గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక ఫామ్‌ ‌హౌస్‌ ‌లో  వీరు ర‌హ‌స్యంగా  కలిశారని ఆరోపించారు. కేసీఆర్ ‌నిర్దేశం మేర‌కే హరీష్‌,  ఈటల కలిశారన్నారు. కాళేశ్వరం కమిషన్‌ ‌విషయంలో అంత ఒకటే సమాధానం చెప్పాలని మాట్లాడు కున్నారన్నారు. ఈ అంశంపై ఈటల రాజేందర్‌ ‌సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ ఒక్కటే అని వందసార్లు చెప్పామన్నారు. కవిత బీజేపీపై సర్జికల్‌ ‌సర్జికల్‌ ‌స్ట్రయిక్‌ ‌చేస్తోందని, దానిపై ఆ పార్టీ స‌మాధానం చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ మ‌ధ్య స యోధ్య గురించి కవిత ఇప్పుడు బయటపెడుతున్నారు. బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించలేదా? బీఆర్‌ఎస్‌తో దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే సంజయ్‌ను తొలగించింది వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు.

బీజేపీ నేతల ప్యాకేజీల గురించి రాజాసింగే చెబుతున్నారు. రాజాసింగ్‌ ‌మాటలకు ఆ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలి. ఈటల రాజేందర్‌.. ‌మోదీ పార్టీలో ఉన్నారా?కేసీఆర్‌ ‌పార్టీలో ఉన్నారా? కాళేశ్వరం స్కామ్‌ ‌నుంచి బయటపడేందుకు ఈటల.. కేసీఆర్‌తో చేతులు కలుపు తున్నారని మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్‌ ‌ముందు ఈటల వాస్తవాలు చెప్పాలి.  దొంగలుదొంగలు ఊర్లు పంచుకున్నట్లు  చేశారని మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శించారు. భారత్‌ ‌పాక్ యుద్ధం అం‌శపై స్పందించారు. పాక్‌పై యుద్ధం సరిగా చేయక ట్రంప్‌కు భయపడి.. విరమించుకున్నారని ఆరోపించారు.

సర్జికల్‌ ‌స్ట్రయిక్స్ ‌చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు.. అప్పట్లో ఇందిరా గాంధీ వందల కొద్దీ సర్జికల్‌ ‌స్ట్రయిక్స్చే సినా ఏనాడూ చెప్పుకోలేదని మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. ఇందిరాగాంధీ గొప్పతనాన్ని ఆనాడు వాజ్‌పేయీ కూడా గుర్తించి.. అపర కాళీ అని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అసలు ఇందిరాగాంధీకి, మోదీకి పోలిక ఏంటని ప్రశ్నించారు. భారత్‌-‌పాక్‌ ‌యుద్దం ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు  యుద్ధానికి తాము సంపూర్ణ మద్దతిచ్చామని చెప్పారు. యుద్ధ్దం వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం కేంద్రంపైన ఉందన్నారు.  రాహుల్‌ ‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *