కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్తగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: దృష్టిలో పెట్టుకొని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు  మూడు గేట్లు పెట్టడం జరిగిందని, ఒకవేళ భారీ వర్షాలు పడి చెరువులో నీరు బయటకు వచ్చి కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సరూర్ నగర్ కట్ట మీద జరుగుతున్న బండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు నందు వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సరూర్ నగర్ ప్రాంతంలో ముంపును తగ్గించేదుకు అనేక రకాల పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రియదర్శిని పార్క్ మసీదు వద్ద గతంలో మూడు గేట్లు పెట్టడం జరిగిందని, దానికి అనుగుణంగా మరో మూడు గేట్లు పెట్టడం జరిగిందని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుందని కాంట్రాక్టర్ తెలపడం జరిగిందని, అయిన సరే వారికి అదనంగా చెల్లించడానికి ముందుకు రావడం జరిగిందని తెలిపారు. ఎట్టకేలకు
పనులు త్వరితగతిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశ్యం చెరువు యొక్క నీటి మట్టాన్నీ నియంత్రణే మా లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే రెండు మార్గాల ద్వారా నీరు బయటకు విడుదల చేయడం జరిగేదని, ఇప్పుడు నిర్మించిన మూడో టన్నల్ వల్ల చెరువులో ఉన్న నీరు త్వరగా బయటకు పోవడానికి వీలు ఉంటుందని తెలిపారు. తద్వారా నీరు ఓవర్ ఫ్లో కాకుండా క్రింద ఉన్న కాలనీలు అయిన కోదండరాం నగర్ కాలనీ, వివేకానంద నగర్, కమలనగర్, న్యూ గడ్డిఅన్నారం కాలనీ, పి అండ్ టీ కాలనీలు ముంపు ప్రాంతం నుంచి రక్షించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, విక్కీ, ప్రదీప్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *