కార్పొరేట్‌ ‌స్థాయిలో వైద్యం.. కేసీఆర్‌ ‌లక్ష్యం

  • ముందు చూపుతోనే పాలమూరు-రంగారెడ్డి నిర్మాణానికి కెసిఆర్‌ ‌నిర్ణయం
  • పాలమూరును త్వరలో కోనసీమగా మారుస్తాం..
  • లక్ష ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఎమ్మెల్యే ఆలాది
  • వనపర్తి జిల్లా పర్యటనలో మంత్రి హరీష్‌ ‌రావు

వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌కార్పొరేట్‌ ‌స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాలోని మదనపురం మండల కేంద్రంలో 160 డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ అనంతరం కొత్తకోట మండల కేంద్రంలో 30 పడకల హాస్పిటల్‌కి మంత్రి హరీష్‌ ‌రావు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గర్భిణీలు నుంచి పసిపిల్లలు డెలివరీ వరకు ఎప్పటికప్పుడు వైద్యం అందించిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేవారని, నేడు పోదాం పద బిడ్డో సర్కారు దవాఖానకు అని ప్రజలు అంటున్నారని అన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్‌ ‌కాలేజీ, పట్టణంలో బస్తీ దవాఖానలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్‌, ‌డయాలసిస్‌ ‌కేంద్రాలు వంటి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రవేశపెట్టి కార్పొరేట్‌ ‌స్థాయిలో వైద్య అందిస్తున్నాడని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ముందు చూపుతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టడానికి నిర్ణయం తీసుకున్నాడని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు త్వరలో కోనసీమగా మార్చాలనేదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తాను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి ఎప్పుడు చెక్‌ ‌డాములు. చెరువులు కావాలని పదేపదే అడిగేవారని, ఊక చెట్టు వాగుపై చెక్‌ ‌డామ్‌లు నిర్మించి ఇక్కడ పొలంలో పచ్చగా మార్చిన ఘనత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డిదని అన్నారు. తెలంగాణలోని గొప్ప పని చేసే నాయకుడు ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి అని ఆయన అన్నారు. దేవరకద్ర నియోజవర్గంలో 100 ఏళ్లలో చేయని అభివృద్ధి తొమ్మిది సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేసి చూపించాడని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతుల మీద ప్రేమతో రైతుబంధు. రైతు బీమా.రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎరువులు. విత్తనాలు పంపిణీ చేయడంతో పాటు రైతులకు ఉచిత 24 గంటల కరెంటు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా భూముల ధరలు పెరిగిపోయాయని దీనికి కారణం రైతుల అభివృద్ధి అని ఆయన అన్నారు. కొరోనా సమయంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల పేదలకు ఉచిత సరుకుల పంపినతోపాటు చాలామంది ఇబ్బందులు ఉంటే ఆదుకున్నాడని ఆయన అన్నారు. ఉచితంగా బియ్యము పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కృషి చేశారని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మూడు గంటలే కరెంటు….
కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తే మూడు గంటల కరెంటు ఇస్తుందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు కర్ణాటకలో ఆరు హామీలపై తల పట్టుకుంటున్నారని అక్కడ తర్జనభజన అవుతున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే రేవంత్‌ ‌రెడ్డి అమెరికాలో అన్నట్టుగా మూడు గంటలే కరెంటు ఇస్తారని ఆయన అన్నారు. గతంలో విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, విద్యుత్తు, తండాలను గ్రామపంచాయతీ చేస్తామనే హామీలను విస్మరించారని మళ్ళీ కూడా అదే పని చేస్తారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు, షాది ముబారక్‌. ‌కెసిఆర్‌ ‌కిట్టు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ హామీలను నిలబెట్టుకున్నాడని…కాంగ్రెస్‌ ఏనాడైనా నిలబెట్టుకుందా అంటూ ఆయన ప్రశ్నించారు.

బిజెపిని జాకీ పెట్టి లేపినా లేవదు…
రాష్ట్రంలో బిజెపిని జాకీ పెట్టి లేపినా లేవలేని స్థితిలో ఉందని హరీష్‌ ‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సెక్షన్‌ 3 ‌ప్రకారం రాష్ట్రాల నీటి వాటా తేల్చాలని తొమ్మిది సంవత్సరాల నుంచి అడుగుతుంటే ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకున్నదని ఆయన అన్నారు. ముందు చూపుతోనే కేసీఆర్‌ ‌పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారని, ప్రస్తుతం మన సాగునీటి వాటా మనకు దక్కుతుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *