పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్, మంద రమేష్ లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ… కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ రంగ పాఠశాలలో డిజిటల్ క్లాసులు నూతన ఫర్నిచర్ విద్యా బోధనకు సంబంధించిన బుక్స్, నోట్స్ బుక్స్ లను ఎమ్మెల్యే సాయంతో అందజేయడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థులను గుర్తించి కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగ పాఠశాలలను అన్ని వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఇది లేదు అనకుండా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారని వారు పేర్కొన్నారు.




