కారు గుర్తుకి ఓటు వేసి గెల్పించండిఅభివృద్ది బాటలు వేస్తాంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 04: కారు గుర్తుకి ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఓట్లు కొరారు మహేశ్వరం మండలం పరిధిలో హర్షగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంత్రి గడప గడప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచకుండా,ఫలితాలు రాగానే పెంచుతారన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్అధికారంలోకి వచ్చిన వెంటనే 400 కే గ్యాస్ అందిస్తారని అన్నారు.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లు 5 వేలు,4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు.మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా 3 వేలు అందిస్తామని,రైతు భీమా లాగా 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు భీమా సౌకర్యం కలిస్తామన్నారు.మహేశ్వరం నియోజకవర్గములో రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు 389 కోట్లు,రైతు భీమా ద్వారా 24 కోట్లు,రుణమాఫీ క్రింద 87 కోట్లు ,ఆసరా పెన్షన్లు 576 కోట్లు,కళ్యాణాలక్ష్మి కింద 108 కోట్లు,షాది ముబారక్ పథకంతో 51 కోట్లు,ముఖ్యమంత్రి సహాయనిది తో 15 కోట్ల సహాయం చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గములోని పట్టణ ప్రాంతాల్లో 16 కోట్లతో సమీకృతా మార్కెట్ సముదాయాలు నిర్మిస్తున్నట్లు,8 కోట్లతో మోడ్రెన్ దోబీ ఘాట్ లు, గొర్రెల పంపిణీకి 42 కోట్లు,చేపల పంపిణీకి 5 కోట్లు,ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవం పొందిన 2029 మంది మహిళలకు కేసీఆర్ కిట్లు,నియోజకవర్గములో 84 కుల సంఘాలకు స్థలాలు కేటాయించి ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించినట్లు,తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *