కాంతి పుంజం

ముద్ద మందారమా

ముగ్ధ మనోహరమా

కారు చీకట్లో.. కన్నీటి

వర్షాన్ని తుడవ..

కాంతి పుంజం లా..

కలల్ని చిదిమిన

కాళరాత్రి ని తరమ

ఎగిసిన ఆశ కెరటమా!

మరుభూమిని

మరిపించా.. పచ్చని

మొలక కి పురుడు

పోసిన అంకురమా !

నవ్వుల్ని బతుకుల్ని

మూటలు కట్టుకొని

అరచేతిలో పాణాల్ని

గుప్పిట్లో ధారపోసి

మొగులుకేసి

చూసిన మా భవిష్యత్తు కు

తొలిపొద్దు వయి..

పొడిచిన క్రాంతి కిరణమా!

మాలో అణగారిన జీవాన్నికి

బతుకు భరోసా కల్పించిన

తొలి తొలకరి జల్లువా !

ఏదైతేనేం ఏవరయితేనేం..

మానవత్వం మనుషులలో

బతికే వుందని..

యే విపత్కర పరిస్థితుల్లోనయిన..

కూడా మనిషి లోని

లోపలి మనిషి ఇంకా

బతికే వున్నాడన్నది

అక్షరాల

నగ్నసత్యం !!

 

– రవీందర్‌ ‌కొండ

9848408612

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *