కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యం కాని హావిూలు

  • ఎలా అమలు చేస్తారో మేమూ చూస్తాం
  • అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది
  • విూడియాతో మాజీ మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి అలవిగాని హావిూలు ఇచ్చారని, ఆయన ప్రతి మాటకూ తమ వద్ద రికార్డు ఉందనీ మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌ను వదిలిపెట్టబోమన్నారు. ఆయన బుధవారం విూడియాతో మాట్లాడుతూ…అధికారంలోకి వొచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్‌ గాంధీ అన్నారని, నాలుగువేల రూపాయల పెన్షన్‌ కూడా ఇస్తామని హావిూ ఇచ్చారని కేటీఆర్‌ గుర్తు చేశారు. అధికారంలోకి వొచ్చిన పది రోజుల్లోగా 15 వేల రూపాయలను రైతు భరోసా కింద అందజేస్తామని చెప్పి, ఇంకా ఇవ్వలేదని అన్నారు. రుణమాఫీ చేయడానికి తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేటీఆర్‌ చెబుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ ఎలా చేస్తుందో చూస్తామన్నారు. తాము చేసిన ప్రతి అప్పుకూ ఆడిట్‌ రిపోర్ట్‌ ఉందన్నారు. ఎవరైనా అధికారంలోకి వొచ్చేముందు ఆదాయావ్యయాల లెక్కలు చూసుకుంటారని, కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇలా మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. లెక్కలు వేసుకుని హావిూలు ఇస్తారా ? హావిూలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలు చాలా ఉన్నాయన్న ఆయన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు. కాంగ్రెస్‌ పాలకులకు అసలు ఆట ఇప్పుడుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సాధ్యం కాని హావిూలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. శాసనసభ ఆవరణలో విూడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారంటూ….కొత్త కథలు చెప్తారని అన్నారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు కేటీఆర్‌. ప్రతి ఏడాది కాగ్‌ నివేదికలు ఇస్తున్నారని..ఆడిట్‌ లెక్కలు తీస్తున్నారని స్పష్టం చేశారు.  ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలిస్తామన్నారని, అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *