కాంగ్రెస్ హయాంలోనే పేదల సంక్షేమం అభివృద్ధి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: కాంగ్రెస్ హయంలోనే  పేదల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యాన్ని మనొహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం  అక్కంపల్లి లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారా సమావేశానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అభ్యర్థి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, నీటి ప్రాజెక్టులు. నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు గత తొమ్మిదిన్నర 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మీ గ్రామంలో నిరుపేద, అర్హులకు ఒక్కరికైన దళిత బంధు, బీసీ బంధు, గృహాలక్ష్మి వచ్చిందా ప్రజలను అడిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు అమలు చేసి ప్రజలకు అందిస్తామని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకున్న టి ఆర్ ఎస్ నాయకులు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ  యాలాల మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *