కాంగ్రెస్ వస్తే.. దళారుల దే  అధికారం

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 02: తెలంగాణ‌లో పొర‌పాటున‌ కాంగ్రెస్ గెలిస్తే.. మ‌ళ్లా  దళారులు  పుట్టుకొస్త‌రు.. కైలాసం ఆట‌లో పెద్ద‌పాము మింగిన‌ట్టు అవుతుంద‌ని తమ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు తూచా తప్పకుండా ప్రజలు గుర్తుంచుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజ‌క‌వ‌ర్గంలో చింతోనపు తండా, అవాజ్మియా పడకల్, గుట్టల గడ్డ తాండా గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో అంజయ్య పాల్గొని ప్ర‌సంగించారు. రైతుబంధుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ర‌కాలుగా మాట్లాడుతుంది అని పేర్కొన్నారు. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్. రైతులు అంతకుముందు ఏడ్చారు. లంచాలు ఇచ్చి ట్రాన్స్‌ఫార్మ‌ర్లు రిపేర్ చేయించుకున్న ప‌రిస్థితి. ఇప్పుడు క‌రెంట్‌ను ఇచ్చుకున్నాం.. నియోజ‌క‌ వ‌ర్గంలో ఎన్నో స‌బ్ స్టేష‌న్లు నిర్మించుకున్నామని అన్నారు. వంద‌లాది ట్రాన్స్‌ఫార్మ‌ర్లు తెచ్చుకున్నామని 24 గంట‌ల క‌రెంట్‌తో పంట‌లు పండించుకుంటున్నామని  తెలిపారు. గ్రామాల్లో రైతుల ముఖాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.తెలంగాణ రాక ముందు క‌రువుల‌తో, వ‌ల‌స‌ల‌తో సాగు,తాగునీటి గోస‌ల‌తో చెట్టుకు గుట్ట‌కు ఒక‌ర‌య్యాం అని గుర్తు చేశారు. గ్రామాలు ప‌చ్చ‌బ‌డాలంటే ఏం చేయాల‌ని ఆలోచించి, వ్య‌వ‌సాయాన్ని స్థీరిక‌రించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారని రైతుబంధు అనేది ఎల‌క్ష‌న్ల కోసం పెట్టింది కాదని ప్రభుత్వం అంత‌ట ప్రభుత్వమే ఆలోచించి ఆ స్కీం తెచ్చారని, నీటితిరువా ర‌ద్దు చేసీ నీళ్లు, క‌రెంట్ ఉచితంగా ఇస్తున్నారని రైత‌బంధు పెట్టుబ‌డి కింద ఇస్తున్నారని రైతులు పండించిన పంట‌ను కొంటున్నాం న‌ష్టం వ‌చ్చినా కూడా ఈ కార్య‌క్ర‌మాల ద్వారా రైతుల ముఖాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయనీ రైతుల రుణ‌మాఫీ కూడా చేశామని కాంగ్రెసోళ్లు పిటిష‌న్ వేశారని ఎన్నికలు ముగిసిన‌ మ‌ర్నాడే అవి కూడా ఇచ్చేస్తాం అన్నారు. వ్య‌వ‌సాయ స్థీరిక‌ర‌ణ కోసం రైతుబంధు తెస్తే.. కేసీఆర్ ప‌నిలేక దుబారా చేస్తున్నాడ‌ని కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతున్నార‌ని అంజయ్య ధ్వ‌జ‌మెత్తారు. క‌రెంట్ 24 గంట‌లు అవ‌స‌రం లేదు.. 3 గంట‌లు చాల‌ని రేవంత్ రెడ్డి అంటున్న‌డ‌ని  తెలిపారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ తెచ్చాం. ఎవ‌రి కోసం, దేని కోసం తెచ్చాం. రైతుల భూములు క్షేమంగా బ్ర‌హ్మాండంగా ఉన్నాయి. నిశ్చితంగా ఉన్నారు రైతులు. ధ‌ర‌ణి రాక‌ముందు వీఆర్వో నుంచి సీసీఎల్ఏ దాకా రైతుల మీద పెత్త‌నం. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఉంది కాబ‌ట్టి రైతుబంధు డ‌బ్బులు నేరుగా వ‌స్తున్నాయి. అదే విధంగా ధాన్యం అమ్మితే.. పైస‌లు నేరుగా మీ బ్యాంకులో ప‌డుతున్నాయి. రైతుబీమా కూడా 10 రోజుల్లో జ‌మ అవుతుంది. మ‌రి ధ‌ర‌ణి తీసేస్తే ఇవ‌న్నీ ఎలా వ‌స్తాయి. ఇప్ప‌టిలాగా వ‌స్తాయా..? మ‌ళ్లీ ప‌హాని న‌ఖ‌లు, వీఆర్వోలు, ఎమ్మార్వో కార్యాల‌యాల చుట్టు తిరుగుడు. మ‌ళ్లీ పైర‌వీకారుల మంద‌లు.. రైతుబంధు వ‌స్తే నీ పేరు రాయాలంటే పైసలు ఇవ్వాలని దళారులు రాజ్యం ఏలుతారని, మ‌ళ్లీ పాత‌క క‌థ‌నే ద‌ళారీల రాజ్య‌మే అని అంజయ్య అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *