కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: బిఆర్ఎస్ సంగారెడ్డి  మండలం , సదాశివపేట పట్టణానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు
కాంగ్రెస్ లో  శుక్రవారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో చేరారు. సంగారెడ్డి మండలం ఇర్గిపల్లి గ్రామ బీఆర్ఎస్ ఉపసర్పంచ్ నవీన్,  ఆయన  టీమ్ కు నవీన్ కి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు. నవీన్ తో పాటు కాంగ్రెస్ గూటికి చేరిన వారిలో ప్రవీణ్ కుమార్, దామోదర్, కృష్ణ ప్రసాద్, మన్న ప్రపుల్లా, విష్ణువర్ధన్ గౌడ్, నర్సింహులు, మాణిక్యం, ప్రశాంత్, మల్లేశం, శ్రీశైలం, సుభాష్, రాము, శ్రీకాంత్, జనార్దన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి సర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.సదశివాపేట్ లోకాంగ్రెస్ పార్టీ లో చేరిన సదశివాపేట్ టౌన్ బీఆర్ఎస్ నాయకువు అనిల్ రెడ్డి, ఆయన  టీమ్ వెంకట్ రెడ్డి, వంశీ గౌడ్,తంగడపల్లి ప్రశాంత్ గౌడ్, ఎం డీ అతేర్ అలీ, సయ్యద్ అహ్మద్, ఎండీ అసద్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.సదశివాపేట్ టౌన్ 3 వార్డు బీఆర్ఎస్ నాయకులు మహబూబ్ అలీ(మౌలానా )మరియు అతని అనుచరులు.కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *