కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : కాంగెస్‌ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమండ్‌ ప్రకటించింది. సీనియర్‌ నేత రేణుకా చేదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించినట్లు సనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర శాసన సభలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 64 మంది సభ్యుల బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. కాగా నామినేషన్ల దాఖలుకు ఈ రోజు గురువారం వరకు గడువు ఉంది.

ఇక పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రేణుకా చౌదరి 1986 నుంచి 1998 వరకు రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. 1999, 2004లలో లోక్‌ సభకు ఖమ్మం నుంచి గెలుపొందారు. ఆమె హెచ్‌డి దేవెగౌడ, మన్మోహన్‌ సింగ్‌ భ్రుత్వాలలో కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక యువ నాయుకుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సీనియర్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కుమారుడు. 2018లో ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వోడిపోయారు. ప్రస్తుతం అనిల్‌ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు రాజ్యసభకు అవకాశం దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *