కాంగ్రెస్, బిజెపి నుంచి ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండలం పరిధిలో పులుమద్ది గ్రామానికి చెందిన మండల నాయకులు కాంగ్రెస్ బిజెపి నుంచి సర్పంచ్ మాధవరెడ్డి మండల పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు గాయాజుద్దీన్ ఆధ్వర్యంలో విక్రంరెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవరెడ్డి, బిచ్చయ్య, నాయకులు జంగయ్య గౌడ్, ప్రకాష్ గౌడ్ మదన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదయ్య, రాములు, వెంకటయ్య, మహేందర్, బలరాం అనుచరులు కాంగ్రెస్, పార్టీల నుండి 110 మంది BRS పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ.వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *