కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం తరం కాదు

  • బిఆర్ఎస్ గతంలో ఏం చేసిందో చూసుకోవాలి
  • బిజెపి, బిఆర్ఎస్లపై  మండిపడ్డ పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి

హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… ప్రధాని మోదీ జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే లక్షంగా బీజేపీ పనిగట్టుకుందని మండిపడ్డారు. పార్టీలో చేరడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చినా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరితే గులాబీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు గులాబీ పార్టీ నేతల తీరు ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ పార్టీదని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో తమకు తెలుసునని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హాలను సీఎం రేవంత్రెడ్డి నెరవేరుస్తారని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు.

అయితే బీఆర్ఎస్ నేతల పై  కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది రు కాదా..? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని ఎమ్మెల్యే తెలిపారు. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని.. ఇందులో టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్సీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారని ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తెలిపారు. 2018లో 16 మందిని చేర్చుకోలేదా..? అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని అన్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా..? అని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని  మంత్రివర్గంలోకి తీసుకోలేదా.. అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్ల పైన చర్యలు తీసుకున్నారా..?అని ప్రశ్నించారు.  ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేశాయని ఆరోపించారు. ప్రమాణస్వీకారానికి ముంది కడియం శ్రీహరి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *