బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి8: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. మా కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో నా భార్యకు అక్రమంగా ఉద్యోగం ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా భార్య నీలిమా ఏపీఎస్ఈబీ బోర్డ్ పరీక్షల్లో టాప్ మార్కులతో 1992లో ఏఈ ఉద్యోగం సంపాదించింది.
అప్పట్లో ఏ ప్రభుత్వం ఉంది.. 35ఏళ్ల క్రితమే నా భార్య ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020 నవంబర్ 19వ తేదీన వీఆర్ఎస్ తీసుకుంది. ప్రస్తుతం అనురాగ్ విద్యాసంస్థలకు సీఈఓగా పని చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మళ్లీ మా ద కుటుంబ సభ్యులను తులనాడుతున్నారు. మల్లన్నపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది. నా భార్య ఉద్యోగం పై ఏ విచారణ అయినా చేసుకోండి. మా యూనివర్సిటీకి ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. ప్రజలు తరిమికొట్టక ముందే చీడ పురుగు ద చర్యలు తీసుకోండి. లేదంటే మాకు క్షమాపణ చెప్పాలి‘ అని పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.




