కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు తో పాటు పలు సీనియర్ నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్01: రాహుల్ జోడో  యాత్ర అనంతరం రాహుల్ గాంధీ రాక సందర్భంగా షాద్ నగర్ నియోజక వర్గం సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు గౌడ్ ఆయనతో పాటు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నవాజ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఈ ఇద్దరు నాయకులతో బుధవారం క్యాపు కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల సూచన సలహాలు ఎంతో అవసరం ఉన్నాయని వారి సేవలను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యకు తోడ్పాటు అందించిన సదరు సీనియర్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాహుల్ గాంధీ రాక సందర్భంగా వారు పార్టీలో చేరుతున్నట్టు ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చర్చల సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో పాటు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, మాజీ ఫరూక్ నగర్ జెడ్పిటిసి వెంకటంరెడ్డి, జమృధ్ ఖాన్ తదితరులు హాజరైనరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *