కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలి గడపగడప కార్యక్రమంలో ప్రజలను కోరిన

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: సార్వత్రిక ఎన్నికల్లో  ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి గెలిపించాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  ఈసి.శేఖర్ గౌడ్ (మామ)కోరారు.బుధవారం ఆయన గడపగడప కార్యక్రమంలో పాల్గొని ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని కరపత్రాల ద్వారా ఇబ్రహీంపట్నం,యంజాల్ మండలాలలో కార్యకర్తలు,నాయకులతో కలిసి పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని,ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని  కోరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,బిఆర్ఎస్ పాలనలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలను తెలుసుకొని తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.పేదలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ ద్వారానే  సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపిస్తున్న ఆదరణ అంతా ఇంత కాదని ఆయన పేర్కొన్నారు.పట్నం నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కార్యకర్తలు నాయకులు ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.కార్యకర్తలు సైనికుల పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే వరకు విశ్రమించకూడదని ఆయన తెలిపారు. తుక్కుగూడ విజయభేరి సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందో ప్రజలు పూర్తిగా గ్రహించారని ఆయన తెలిపారు.సభ విజయవంతం కావడంతో ఇతర పార్టీల్లో వణుకు పుట్టిందని ఆయన తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు కృతనిచ్చేయంతో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో బ్లాక్   కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ గౌడ్,తమ్మల్ల కృష్ణ,శ్రీహరి,మడుపు స్వామి,శివ గౌడ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు శేఖర్ గౌడ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *