కాంగ్రెస్ పార్టీ నుంచి శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఓ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించి రేప్ చేసిన కేసులో నింధితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత కుంబం శివకుమార్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బంజారా మహిళా సంఘం అధ్యక్షురాలు ఇందుబాయి, ప్రతినిధులు దేవి, కె.చిట్టి, జే.సోనీ చిట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కంబం శివకుమార్ రెడ్డిని పార్టీ పదవి నుంచి తొలగించారే తప్ప పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని అన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శివకుమార్ రెడ్డిపై కేసు కూడా నమోదైందని, శివకుమార్ రెడ్డికి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండగా ఉన్నందువల్లనే పోలీసులు చర్యలు తీసుకోలేక పోతున్నారని వారు ఆరోపించారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ మహిళ ఇప్పటి వరకు కనిపించకుండా పోయిందని, మహిళ మిస్సింగ్ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైందని పేర్కొన్నారు. శివకుమార్ రెడ్డి సెల్ఫోన్ను సీజ్ చేస్తే అందులో మొత్తం సాక్ష్యాధారాలు బయటకు వస్తాయని తెలిపారు. బట్టలు లేకుండా న్యూడ్ ఫోటోలోను పంపిచే వాడని వారు తెలిపారు. హైకోర్టు శివకుమార్ రెడ్డి ఫోన్ సీజ్ చేయాలని ఆర్డర్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో బాధిత మహిళకు రక్షణ కల్పించి శివకుమార్ రెడ్డిపైన చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మహిళలకు రక్షణ కల్పించే విధంగా చూడాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *