కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్న నేతలు.
హస్తం పార్టీలో జొష్ నింపుతున్న చేరికలు.
తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: అధికార పార్టీ టిఆర్ఎస్ నుండి పట్టణానికి చెందిన కౌన్సిలర్లు పలువురు పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బుధవారం మంత్రి మహేందర్ రెడ్డి వర్యులు గా మొదలపడిన కౌన్సిలర్లు నీరాజా బాల్రెడ్డి బోయ రవి అబ్దుల్ రజాక్ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ కవి టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రావుప్ నాయకులు బాల్రెడ్డి బోయ రాజు మసూద్ రాకేష్ తోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరిన కౌన్సిలర్లు నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏమి చేయలేక పోయామని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన నమ్మకంతొ కాంగ్రెస్ పార్టీలొ చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు. డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ హయాంలోనే పేదల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం వాటిపైనే ఉంటుందని తెలిపారు. తెలంగాణ వస్తే ప్రజల ఆకాంక్షాలు నెరవేరుతాయని నమ్మి టిఆర్ఎస్కు అధికారం ఇస్తే మాయ మాటలు తో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పైన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి నా స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి తాండూరు అభివృద్ధి చేస్తానని చెప్పి తాండూరు ప్రజలను మోసం చేశారని అన్నారు. గత 32 ఏళ్లుగా రాజకీయాలలో ఉంటూ ప్రజలకు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తాండూరు పట్టణంలోని సాయిపూర్ ఇంద్రనగర్ పలు కాలనీల నుండి పలువురు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.




