కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలపై ఇంటింటి ప్రచారం

కుల్కచర్ల, ప్రజాతంత్ర అక్టోబర్ 18: కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్‌అదికారంలోకి రావడం ఖాయం ప్రజలంతా కాంగ్రెస్‌ కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసాని భీంరెడ్డి,ఎంపీటీసీ ఆనందం అన్నారు.బుదవారం నాడు కుల్కచర్ల మండల కేంద్రము లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచుతు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందంటే అమలుచేసి తీరుతుందన్నారు. దళిత భందూ,బీసీ బందు, మైనార్టీ బందులు అర్హులకు ఇవ్వాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు  మోత్కూర్ వెంకటేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగని ఆంజనేయులు,భవన నిర్మాణం సంఘం అధ్యక్షులు ఐలగారి కృష్ణయ్య , జాఫర్ ,భోగం రాంచెంద్రయ్య, కంగారి రవి, నర్సింలు , బాను మురళి కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *