కాంగ్రెస్ నాయకులు రాజ్ బోడాపై కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 22: చేవెళ్ళ మండలంలోని పోలీస్ స్టేషన్లో రాజ్ బోడ ఎన్ఆర్ఐపై ఫిర్యాదు చేసిన బిఎస్పి నాయకులు.ఆనంతరం చేవెళ్ళ అసెంబ్లీ అధ్యక్షులు చందు  మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బలపడుతున్న బీఎస్పీ పార్టీ ప్రజాదరణ చూడలేక అమెరికాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుచరుడు రాజ్ బోడా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం గాజులగూడెం చందు అన్నారు.ప్రవీణ్ కుమార్ ను ఉద్దేశించి రాజ్ బోడా ఎన్నారై ఆలా మాట్లాడడం శోచనీయం అవివేకం ప్రజలల్లో బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ టీం కుట్రలు చేసి ప్రవీణ్ కుమార్ గౌరవానికి భంగం కలిగించే విధంగా రాజ్ బోడా అనే వ్యక్తి చేత నిరాధార ఆధారం లేని ఆరోపణలు  చేయించడం సిగ్గు చేటు అన్నారు. రాజ్ బోడా మీద పోలీస్ శాఖ పూర్తి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నాయకులు  డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జామ చంద్రం,నవాబ్ పేట్ మండలాధ్యక్షులు కడ్చర్ల సుధాకర్,చేవెళ్ళ మండలాధ్యక్షులు మొకరం కుమార్,పార్టీ సీనియర్ నాయకులు మొకరం రాజు,ఆలూర్ గ్రామ కమిటి అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *