- కరెంట్‌పై మాట్లాడే దమ్ముందా..?
- బిజెపికి మతపిచ్చి ఎక్కువ
- దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలి
- రైతుల ఉక్కు కవచం సిఎం కెసిఆర్
- నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు
- బీజేపీ అంటే బిగ్గెస్ట్ ఝూటా పార్టీ : ట్విట్టర్(ఎక్స్) వేదికగా మంత్రి కెటిఆర్
నిర్మల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4 : ‘ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే.. కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి..విద్యుత్ వైర్లను కోసేసిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాల్వలపై మోటార్లు పెట్టి.. బ్రహ్మాండంగా నీళ్లు పారించుకుంటున్నారు. ఇవాళ మనకు కేసీఆర్ ధైర్యం. రైతు రక్షణ కవచం మన ముఖ్యమంత్రి కేసీఆర్’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరెంట్ గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు ఇజ్జత్ ఉండాలె..అని కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం నిర్మల్ పట్టణంలో వందల కోట్ల రూపాయాలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ..దిలావర్పూర్ మండలంలో రూ. 714 కోట్లతో నిర్మించిన శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతలకు ప్రారంభించుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 50 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని, సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో రూ. 300 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనం చేశామని, ఈ ఫ్యాక్టరీలో 300 మందికి ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని కెటిఆర్ తెలిపారు. నిర్మల్ పట్టణంలో వందల కోట్ల రూపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నామని మంత్రి తెలిపారు. రెండు సార్లు కేసీఆర్‌ను ఆశీర్వదించి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నడుపమని అవకాశం ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. మళ్లీ ఎలక్షన్లు వొస్తున్నాయి. ఈ తొమ్మిదినరేండ్లలో ఏం చేశామో.. మళ్లా ఎందుకు వోటేయాలని కోరుతున్నామో.. చెప్పడానికి వొచ్చామన్నారు. తాము చేసింది, చెప్పింది నిజమైతే కడుపు నిండా వోట్లు వేయండని, ఒక వేళ తాము చెప్పింది తప్పయితే వోట్లు వేయకండన్నారు. 2014లో కరెంట్, తాగు, సాగునీటి పరిస్థితి ఎట్ల ఉండే.
ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించి వోటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్మల్ పట్టణం అభివృద్ధి చెందిందని, 2014కు ముందు ఏదైనా కష్టమొస్తే..జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారుల దగ్గరకు వెళ్లాలంటే 70 కిలోవి•టర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వొచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా నిర్మల్‌లోనే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించుకున్నామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరూ ఇక్కడకు వొచ్చారని, మన కలెక్టరేట్లు ఉన్నట్లు..ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా లేవన్నారని కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఉండేవని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు ఎండాకాలం వొచ్చిందంటే సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యేలకు ఎక్కడ కుండలు, బిందెలు అడ్డం పెడుతారో అనే భయం ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దని, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు పదేండ్ల కింద 10 గంటలు కరెంట్ పోతే అడిగినోళ్లు లేరని, ఇప్పుడు 10 నిమిషాలు కరెంట్ పోతే ఆగమైపోతున్నారన్నారు.
తాను ఒక్కటే గుర్తు చేస్తున్నానని, 28 రాష్ట్రాల్లో ఎక్కడా రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదని, కేవలం కేసీఆర్ మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తున్నాడన్నారు. ఎక్కడ ఉన్నది కరెంట్ మాకు కనబడుతలేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, నిర్మల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు బస్సులు ఏర్పాటు చేస్తామని, ఏ ఊరికి పోతరో పోండని, ఏ టె•మ్కు పోతరో పోండని, వరుసగా నిలబడి గట్టిగా కరెంట్ తీగలను పట్టుంటే కరెంట్ వొస్తుందో లేదో తేలిపోతదని, రాష్ట్రానికి కూడా దరిద్య్రం వదిలిపోతదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారికి మాట్లాడానికి సిగ్గు శరం ఉండాలన్నారు. 2014కు పూర్వం కరెంట్ సమస్యలు ఉండేవని, కరెంట్ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులకు ఇజ్జత్ ఉండాలె అని, రోజుకు 6 గంటల కరెంటని చెప్పి..ఏనాడూ ఆరు గంటలు ఇవ్వలేదని, మూడు గంటలు ఒకసారి, మరోసారి మూడు గంటల కరెంట్ ఇచ్చేవారని కెటిఆర్ అన్నారు. ఎరువులు, విత్తనాల కోసం పోలీసు స్టేషన్లు, దుకాణాల ముందు చెప్పుల లైన్లు దర్శనమిచ్చేవన్నారు. ఇవాళ కడుపు నిండా కేసీఆర్ కరెంట్ ఇస్తున్నారన్నారు తాను చెప్పేది వాస్తవమైతే తమకు వోటేయాలని..తప్పయితే తమకు ఇష్టమున్నట్లు వోటు వేసుకోండని కేటీఆర్ సూచించారు.
బీజేపీ అంటే బిగ్గెస్ట్ ఝూటా పార్టీ : ట్విట్టర్(ఎక్స్) వేదికగా మంత్రి కెటిఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఆ అవసరం కూడా లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా బీజేపీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు గతంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి పనిచేశాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ ఝూటా పార్టీ అని..2018లో ఆ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వొచ్చి బీఆర్ఎస్కు మద్దతిస్తామని తెలిపారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఆ అవసరం కూడా లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా బీజేపీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు గతంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి పనిచేశాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ ఝూటా పార్టీ అని..2018లో ఆ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వొచ్చి బీఆర్ఎస్కు మద్దతిస్తామని తెలిపారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారా? అని ప్రశ్నించారు.
అప్పుడే బీజేపీ చేసిన ఆఫర్‌ను బీఆర్ఎస్ తిరస్కరించిందని స్పష్టం చేశారు. అప్పట్లో కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తాకథనాలను కూడా ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. సెలెక్టివ్ అమ్నేషియాతో బాధపడుతూ..ఇష్టం వొచ్చినట్లు స్టోరీలు అల్లే పొలిటికల్ టూరిస్టులు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. 105 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం తమకు లేదన్నారు. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు సంపూర్ణ మెజారిటీ ఉండగా..బీజేపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తముం ఫైటర్స్ అని..చీటర్స్ కాదని కెటిఆర్ స్పష్టం చేశారు.





