కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌తో ప్రకంపనలు

  • బిఆర్‌ఎస్‌కు నిద్దుర పట్టడం లేదు
  • కర్నాకటలో పథకాల తీరును పరిశీలించుకోవచ్చు
  • బిఆర్‌ఎస్‌ ‌విమర్శలపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ ఎదురు దాడి

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ చెప్పినదే చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. కర్నాటకలో ఇచ్చిన హావి•లును అమలు చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్‌ ‌కేంద్రంలోనూ ఇచ్చిన హావి•లు అమలు చేయడం వల్లనే దేశంలో పురోగతిలో ఉందన్నారు. కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌ అధికార బిఆర్‌ఎస్‌లో ప్రకంపనలుసృష్టిస్తోందని అన్నారు.  సోమవారం వి•డియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌, ‌సీఎం కేసీఆర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ ‌పార్టీ ఇస్తేనే… తమరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌  ‌మహారాష్ట్రకు ఎందుకు వెళ్తున్నారో.. రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

దళితులు గురించే మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. కర్ణాటకలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఉంది కదా… వి• నాయకులను అడగండి కాంగ్రెస్‌ ‌పార్టీ ఏం చేసిందో. కవిత వి• కుటుంబంతో కర్ణాటకకు రండి… ప్రజాదర్బార్‌ ‌నిర్వహిద్దాం అని షబ్బీర్‌ అన్నారు. మంత్రులకే అపాయిట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్‌ ‌కామారెడ్డికి వచ్చి ఏం చేస్తారని నిలదీశారు. కనీసం ఓటు కోసమైనా ప్రజలను కలుస్తారా అని ఎద్దేవా చేశారు. 50 సంవత్సరాలు తెలంగాణ కావాలని పోరాడిన బిడ్డ గద్దర్‌కు కేసీఆర్‌ ఒక్కసారి కూడా ప్రగతి భవన్‌కు రానివ్వలేదన్నారు. అమిత్‌ ‌షా పచ్చి అబద్దాల మనిషి అని.. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎప్పుడూ ఒక్కటి కాదు అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు అలైబలై చేసుకుని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ముదిరాజ్‌ ‌సోదారులకు కులవృత్తి లేదని… అలాంటి వారికి ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వలేదని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *