సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 18: కాంగ్రెస్ మేధస్సు నుంచి పుట్టిన మానస పుత్రికయే ఉచిత విద్యుత్ పధకం దీనిని బిఆర్ఎస్ కాపీ కొట్టి నేడు కాంగ్రెస్ పై గ్లోబల్ ప్రచారం చేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ హయాంలో రైతులకు వ్యవసాయానికి చేసిన అభివృద్ధిని తెలంగాణ రైతాంగం మర్చిపోదు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని గతంలో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఉచిత విద్యుతే కాదు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. చరిత్రను ఎవరు మార్చలేరు. కేవలం రాజకీయాలకు బిఆర్ఎస్ రైతులను తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో వాళ్లు ఇచ్చిన హామీలను అమలు చేయని వాళ్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు పలుకుతున్నట్లు ఉంది.రైతు రుణమాఫీ చెయ్యని ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలి.దళిత సమాజానికి మూడు ఎకరాల భూమిఇస్తానని చెప్పి మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పాలి. వ్యవసాయానికి పంటలకు కనీస మద్దతు ధరఇవ్వని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి.కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి.కలెక్టర్లతో ఉన్నత అధికారులతో రైతులు వడ్లు నాటోదని బెదిరించిన ఈ ప్రభుత్వాన్ని పాతళలోకానికి తరిమివేయాలి. ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలో వస్తే బోరు బావులకు మీటర్లు పెడతయానే విషయాన్ని గమనించాలి.రైతు వ్యతిరేకి రైతు దోహుళ ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేసి రైతును రాజు చేసిన వ్యవసాయాన్ని పండుగ చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎల్లవేళలా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పై గ్లోబల్ విష ప్రచారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి చెంప దెబ్బ ఇవ్వాలని రైతులతో మనవి చేస్తున్నాం.




