కాంగ్రెస్‌ అసమ్మతిని దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌పరిష్కరిస్తారు

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు  స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్‌ ‌నేతలకు అన్యాయం జరిగిందనేది తమ వాదనని.. కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయమని తాము అడగలేదన్నారు. సమస్యను పరిష్కరించమని అధిష్టానం సీనియర్‌ ‌నేత దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌ను నియమించిందని, ఇది మంచి పరిణామమని అన్నారు.

దిగ్విజయ్‌ ‌వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలంటూ సమావేశాలు పెట్టే నేతలకు వీహెచ్‌ ‌విజ్ఞప్తి చేశారు. ప్రసుత్తం సమావేశాన్ని విరమించుకోవాలని సూచించారు. దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌కంట్రోల్‌ ‌చేస్తారని అనుకుంటున్నానని, ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ఇన్చార్జిగా చేసిన అనుభవం దిగ్విజయ్‌ ‌సింగ్‌కు ఉందన్నారు. తాము ఎన్నడూ రేవంత్‌ను వెళ్లగొట్టమని అనలేదని, కలుపుకొని పోవాలని చెప్తున్నామని హనుమంతరావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *