ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ .. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొంది .. ఎమ్మెల్యే కావాలనే దురాశ, దుర్బుద్ధితో ఓర్వలేక ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి చేసి తీరా టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ను కొనుగోలు చేసి..? బిఆర్ఎస్ పార్టీని మోసం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని ఈనెల నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి గొర్ల కాపరుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, రాష్ట్ర షిప్ అండ్ గోట్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గౌరవించారన్నారు. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ పదవికి ఫోటో కాల్ ఎక్కువగా ఉంటుందని అలాంటి పదవిలో ఉంటూ కసిరెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు..? ఇంకా ఎమ్మెల్సీ పదవికి 5 సంవత్సరాల కాలపరిమితి ఉన్న పోటీ చేయడంలో అంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాలని కోరారు. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు చల్ల వంశీచందర్ రెడ్డి అనుకుంటే టికెట్ ఆయనకే దక్కేదని.. కావాలనే ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి వంశీచంద్ రెడ్డి టికెట్ అమ్ముకున్నాడని ఆరోపించారు..? నారాయణరెడ్డి టికెట్ కొన్నాడని జైపాల్ యాదవ్ ఆరోపణలు చేశారు..? వీరు ఆడుతున్న నాటకమంతా ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. గొర్ల కాపరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని ఆయన తెలిపారు. మీ వంశానికి చెందిన బిడ్డగా తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. గొర్రె కాపరులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 3.80 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రెండో విడతలో కూడా ఒక లక్ష 75 వేల రూపాయలతో 20 గొర్రెలు ఒక గొర్రె పొట్టేలు పంపిణీ చేస్తామన్నారు.. ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాలు .అభిమానించే జైపాల్ యాదవ్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతి గా ఇవ్వాలన్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఓట్లు అడగాలన్నారు. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దువుతోందని అన్నారు. రాష్ట్ర షిప్ అండ్ గోట్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యేగా నాలుగో సారీ జైపాల్ యాదవ్ కు ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని గొర్రె కాపరులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు లాలయ గౌడ్, రాములు యాదవ్, కడారి రామకృష్ణ, నిట్ట నారాయణ, దుడ్డు ఆంజనేయులు యాదవ్, నరేష్ యాదవ్, రాజేందర్ యాదవ్, రమేష్ నాయక్, వడ్డే వెంకటేష్ పాల్గొన్నారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడించాలి



