కష్టాలలో ఆదుకొని నాయ కులు.. ఎన్నికల కోసం వస్తున్నారు

ఎల్.బి.నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 4:  పకృతి విపత్తులు, వరదల సమయంలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న.. పట్టించుకోని నాయకులు.. ఎన్నికల కోసం వస్తున్నారని  ఎల్బీనగర్  ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  అన్నారు. స్వలాభం కోసం వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే నాయ కులను నమ్మొద్దని .. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హితవు పలికారు.హయత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  సమక్షంలో హయత్ నగర్ రంగనాయకుల గుట్ట బస్తి, అంబేద్కర్ నగర్ కాలనీవా సులు దాదాపు 150 మంది పురుషులు, మహిళలు, యువకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సుధీర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు  మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి  నియోజకవర్గనికి చేస్తున్న అభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాలు నచ్చి ఇట్టి పార్టీలోకి చేరడం  జరిగింద న్నారు. సుధీర్ రెడ్డి అంటే గొప్ప నమ్మకం భరోసాని అని చెప్పారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..గతంలో చిన్నపాటి వర్ధనికి బస్తి లు,  పక్కఉన్న బంజారబస్తి పూర్తిగా నీట మునిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్.ఎన్.డి.పీ.పనులు వేగవంతంగా చేయించి ఎంత పెద్ద వర్షం వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ నియో జకవర్గన్నీ వేల కోట్ల రూపా యల వ్యయంతో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇంకా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది అని సుధీర్ రెడ్డి వెల్లడించారు.  నియోజకవర్గ అబివృద్దే తన లక్ష్యం అని తెలిపారు. ఇప్పుడు కొందరు నాయకులు కొత్త  మాటల తో వరుసలు కలుపుతున్నారని.. కల్లబొల్లి మాటల ను నమ్మ వద్దని ఆయన సూచించారు. వర్షాలు,వరదలు వచ్చినప్పుడు పత్తకులేని నాయకులు ఇప్పుడు కొత్త వరసలతో వస్తున్నారు అట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని గల్లీ,గల్లీలో తిరిగిన అనుభవం తనకు ఉందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి  సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ సాగర్, మల్లేష్ ముదిరాజ్, స్కీలాబ్, మధు, కాలనీ అధ్యక్షులు తొండ వెంకటేష్,చింతమల్ల పుష్ప,నాగరాజు,తిరుపతి,స్వామినాయక్,వీరన్న,  కొండయ్య,దేశపద్మ,వీరమణి,మునగాల శీను,సాయి,మస్తానీ,మల్లిక,రాజేశ్వరి,రాము,రాములు,రవి,సైదులు,నరేందర్ గౌడ్,రాకేష్,రామకృష్ణ, ,మహేష్,కరుణాకర్,అంబేద్కర్ కాలనీ ప్రతినిధులు బాపనపల్లి నాగరాజు,రాజు,ప్రవీణ్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *