హృదయం ఉడుకుతోంది
ఉవ్వెత్తున జ్వలిస్తున్న ఆవేదన
ఆవిరవుతుంది..
ఆకాశపు గొడుగులో
తల దాచుకోవాలన్న ఆశ
నిరాశ తూఫాన్లో కొట్టు మిట్టడుతుంది..
స్వార్థపు మబ్బులో
మమతల హరివిల్లు మాయమై
మానవత్వపు పరిమళాలు వెదజల్లె
మానవ సమాజం ‘ మనిషి ‘ అస్తిత్వాన్ని
కోల్పోతుంది
బంధాలు.. అనుబంధాలు
కాసుల వేటలో ఎండ మావులవుతు
ప్రేమానురాగాలకు నిర్వచనలు
వెతుకుతున్నాయి
అంతేలే.! పేదల బతుకులు
ముళ్ళమీద పడ్డ అరిటాకులా..
ఆరిపోతున్న కోడగట్టు దీపం లా..
ఎన్నాలయింది.. స్వాతంత్ర మొచ్చి
ఇంకా.. ఈ భిచ్చాపు బతుకుల్లేనా..!
వీళ్ళు మనుషులేనని మరిచి
ఓట్లను పిండే మర యంత్రాలను
చేశారే..!!
ఆకలి, అనారోగ్యం, పేదరికం
గట్లపై నిలువ నీడ లేక
పుట్ పాత్ లే పుట్టిల్లుగా
బతుకుతున్న భావ దరిద్ర్యానికి
విముక్తి ఎప్పుడు..?
రంగుల కలల కథలు చెప్పి
మురిపిస్తూ మభ్యపెట్టే
రాజకీయ అనాగరికతకు
తెర దించేది ఎన్నడూ..?
కవి కలం పదునెక్కుతుంది
దగా పడ్డ గాయలకు శాస్త్ర చికిత్సకై
అణగారిన బతుకులల్లో
తొలకరి జల్లులయి కురవడానికి
అక్షరాలు పురుడు పోసుకుంటున్నాయి.!
చీకట్లను తరుముకొంటూ..
తూర్పు తలుపు రెక్కలు..
తెరిపించడానికి
అడుగు ముందుకు వేస్తున్నాయి..!!
-రవీందర్ కొండా
9059237771
హైదరాబాద్




